Breaking News

మోగిన బీహార్​ ఎన్నికల నగరా

మోగిన బీహార్​ఎన్నికల నగరా

  • మూడు దశల్లో అసెంబ్లీ ఎలక్షన్స్
  • అక్టోబర్​ 28న ఫస్ట్ ఫేజ్ పోలింగ్
  • నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్ లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 28న తొలిదశ (16 జిల్లాలు- 71 నియోజకవర్గాలు), నవంబర్ 3న రెండో దశ (17జిల్లాలు- 94 స్థానాలు), నవంబర్ 7న మూడవ దశ (15 జిల్లాలు- 78 స్థానాలు) ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ ఎన్నికల తేదీ ప్రకటించగానే రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా, నవంబర్ 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కోవిడ్ సోకిన వారికి కూడా ఈ ఎన్నికల్లో ఓటువేసే అవకాశమిచ్చారు. అయితే అందరితో కాకుండా వారికి ప్రత్యేక సమయం కేటాయించారు. కరోనా నేపథ్యంలో జరగబోయే ఎన్నికలు కావున అందులో పాల్గొనే సిబ్బంది కోసం ఏడులక్షల శానిటైజర్లు, 46 లక్షల మాస్కులు, ఆరులక్షల పీపీఈకిట్లు, 7.6 లక్షల హ్యాండ్ గ్లోవ్స్ సిద్ధం చేసినట్టు ఈసీ తెలిపింది.