సారథి న్యూస్, హుస్నాబాద్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుమార్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకమైన నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, డైరెక్టర్ ఆఫ్ లేబర్ కోపరేటివ్ ఆఫ్ ఇండియా రాజ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మహ్మద్ అన్వర్, ఆయూబ్, కౌన్సిలర్లు నళినిదేవి, సుప్రజా, హరీశ్ పాల్గొన్నారు.
- May 25, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- HUSNABAD
- MLA
- రంజాన్
- శుభాకాంక్షలు
- సతీష్ కుమార్
- Comments Off on ముస్లింల అభ్యున్నతికి కృషి