Breaking News

భౌతిక దూరం పాటించండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్​ పి.నల్లనయ్య అన్నారు. కరోనా నేపథ్యంలో బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. మురుగు నీటి కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలని, బ్లీచింగ్ ప్రతిరోజూ చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు మాస్కులు తప్పనిసరి కట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని తెలిపారు.