ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడితో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ జరిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు. అయితే ఇటీవల కాజల్ ముంబైలోని ఓ హోటల్లో బిజినెస్మెన్ కుమారుడితో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు సమాచారం. తల్లిదండ్రులు సూచించిన వ్యక్తినే కాజల్ పెళ్లాడబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాజల్ తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తుంది. దాంతో పాటు మంచు విష్ణు మోసగాళ్లు సినిమాలో కూడా నటిస్తుంది. ఇవే కాదు మరో రెండు మూడు సినిమాలు కూడా లైన్లోనే ఉన్నాయి.
- August 16, 2020
- Archive
- సినిమా
- BUSINESSMAN
- ENGAGEMENT
- HYDERABAD
- కాజల్అగర్వాల్
- ముంబై
- హైదరాబాద్
- Comments Off on బిజినెస్మెన్తో కాజల్ ఎంగేజ్మెంట్?