Breaking News

బిగ్​బాస్ పై​ పుకార్లు.. పూనమ్​ క్లారిటీ

బిగ్​బాస్​కు నో చెప్పింది

తాను బిగ్​బాస్​ సీజన్​ 4లో పాల్గొనడం లేదని పూనమ్​ కౌర్​ క్లారిటీ ఇచ్చేసింది. బిగ్​బాస్​లో సీజన్​ 4లో పాల్గొనేది వీళ్లనంటూ కొంతకాలంగా సోషల్​ మీడియాలో, కొన్ని వెబ్​సైట్లలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొందరు సెలబ్రిటీలు తాము బిగ్​బాస్​లో పాల్గొనడం లేదు అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. ఇప్పటికే యువనటుడు తరుణ్​, హీరోయిన్​ శ్రద్ధాదాస్​ తాము బిగ్​బాస్​ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. శ్రద్ధాదాస్​ అయితే ఏకంగా మీడియాపైనే ఫైర్​ అయ్యింది. తనపై తప్పడు వార్తలు రాస్తే కేసులు పెడతానంటూ హెచ్చరించింది. అయితే బిగ్​బాస్​లో పూనమ్​ బెర్త్​ కన్​ఫార్మ్​ అయ్యిందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను పూనమ్​ కూడా ఖండించపోవడంతో అంతా నిజమనుకున్నారు. కానీ పూనమ్​ తాజా పోస్టుతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. పూనమ్​ను బిగ్​బాస్​ టీం సంప్రదించిన మాట వాస్తవమేనని.. కానీ ఆమెకు వారు చెప్పిన ప్యాకేజీ నచ్చకపోవడంతోనే ఆఫర్​ తిరస్కరించినట్టు సమాచారం.