Breaking News

ఫైలెట్​, కో ఫైలెటే కొంపముంచారు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్​లో గత నెలలో విమానం కూలిపోవడం మానవతప్పిదమేనని ఆ దేశ విమానయానశాఖ మంత్రి గులామ్​ సర్వార్​ ఖాన్​ వెల్లడించారు. పైలెట్‌, కో పైలెట్‌ కరోనా వ్యాప్తి గురించి మాట్లాడుకుంటూ ల్యాండింగ్‌లో తప్పు చేశారని అన్నారు. పైలెట్‌, కంట్రోల్‌ ఇద్దరూ రూల్స్‌ ఫాలో అవ్వలేదని అన్నారు. కరోనా వైరస్‌ గురించి మాట్లాడుకుంటూ ల్యాండ్‌ చేశారని, వాళ్ల మధ్య చాలా సేపటి నుంచి అదే డిస్కషన్‌ జరిగిందని చెప్పారు. పైలెట్‌, కో – పైలెట్‌ ఇద్దరూ నిర్లక్ష్యం వహించారని చెప్పారు. పాక్‌, ఫ్రెంచ్‌ గవర్నమెంట్‌ చేసిన దర్యాప్తులో ఈ విషయం తేలినట్లు మంత్రి చెప్పారు. రికార్డింగ్స్‌ ఆధారంగా దాన్ని ధ్రువీకరించామన్నారు. ప్రమాదానికి గురైన ఫ్లైట్‌ 100 శాతం ఫిట్‌గా ఉందని, టెక్నికల్‌ ఫాల్ట్‌ ఏమీ లేదని అన్నారు. పాకిస్తాన్‌లో మే 22న ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీ‌ దగ్గర ప్రమాదానికి గురైంది. రెండు ఇంజిన్లు ఫెయిల్‌ అవడంతో ఇళ్ల మధ్య కుప్పకూలిపోయింది. దీంతో ఆ ప్రమాదంలో 97 మంది చనిపోయారు.