- క్రికెట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిస్ నెన్జానీ
జొహన్నెస్‌బర్గ్: ఐసీసీ చైర్మన్‌గా కొత్త వ్యక్తికి మద్దతిచ్చే ముందు తమ దేశబోర్డు ప్రోటోకాల్ పాటించాలని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) అధ్యక్షుడు క్రిస్ నెన్జానీ అన్నారు. తద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ రావాలన్నా ప్రొటీస్ క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలకు నెన్జానీ కౌంటర్ ఇచ్చారు. ‘ఐసీసీతో పాటు మన వ్యక్తిగత ప్రొటోకాల్‌ను కూడా ప్రతిఒక్కరూ పాటించాలి.
ఏ అభ్యర్థికి మద్దతు అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాల్సిన అంశం. ఇప్పటివరకు ఏ అభ్యర్థిని చైర్మన్‌గా నామినేట్ చేయలేదు. ఎవరైనా నామినేషన్ వేసినా ఎవరికి మద్దతు ఇవ్వాలనేది సీఎస్ఏ తన సొంత ప్రోటోకాల్ పరంగా నిర్ణయం తీసుకుంటుంది. ఐసీసీ బోర్డు డైరెక్టర్‌గా తన ఓటు హక్కును వినియోగించుకునే అధికారాన్ని చైర్మన్‌కు ఇస్తుంది’ అని నెన్జానీ పేర్కొన్నాడు.