- మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు
సారథి న్యూస్, పెద్దపల్లి : రాష్ట్రంలోని రైతులు, కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన పంటలనే పండించాలా..అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మండిపడ్డారు. బుధవారం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం చెప్పిన పంటలు పండించకపోతే రైతుబంధు ఇవ్వబోమని చెప్పడం సరికాదన్నారు.
రైతులు పండించిన దొడ్డు రకం వడ్లకే ఏ గ్రేడ్ ధర కాకుండా కామన్ రేట్ కింద తీసుకుని వడ్లను కటింగ్ చేస్తూ ఇప్పటికీ పూర్తిగా ధాన్యం కొనలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాన్ని చూస్తే రైతుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నదో తెలుస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో నుగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్ ,తూముల సుభాష్ ,తాడూరి శ్రీమన్నారాయణ, బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.