Breaking News

ప్రధాని మోడీకి అంకితం

న్యూఢిల్లీ: ప్రముఖ వాయోలినిస్ట్‌ ఎల్‌. సుబ్రమణియన్‌ ‘వసుదైవ కుటుంబం’ అనే సింఫనీని ప్రధాని నరేంద్ర మోడీకి అంకితమిచ్చారు. ప్రముఖ పండితులు జైరాజ్‌, బిర్జూ మహరాజ్‌, ఏసుదాసు తదితరులతో కలిసి దాన్ని రూపొందించారు. ‘లండన్‌ సింఫనీ ఆర్కెస్ట్రా, లెజండరీ ఆర్టిస్టులు జాస్‌రాజ్‌, బిర్జూ మహరాజ్‌, బేగం పర్వీన్‌ సుల్తాన్‌, ఏసుదాసు, ఎస్పీబీ, కవితలతో కలిసి భారత సింఫనీ వసుదైవ కుటుంబం అనే సింఫనీని రిలీజ్‌ చేశాను. దాన్ని దేశానికి, మన ప్రధాని అంకితం ఇస్తున్నాను’ అని సుబ్రమణియన్‌ ట్వీట్‌ చేశారు. కాగా మోడీ దానికి స్పందించి రిప్లై ఇచ్చారు. ‘వసుదైవ కుటుంబం’ సింఫనీ గురించి మోడీ ట్వీట్‌ చేశారు. ‘వసుదైవ కుటుంబం అద్భుతమై కూర్పు. ఇది చక్కని సందేశాన్ని తెలియజేస్తుంది. గొప్ప ప్రయత్నం చేశారు’ అని మోడీ ట్విట్టర్‌‌లో పోస్ట్‌ చేశారు.