సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రతి చెరువును నీటితో నింపేందుకు ప్రణాళికలు రెడీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన రామడుగు మండలం లక్ష్మీపూర్ పంపుహౌస్ ఆఫీసులో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో కలిసి నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రతి చెరువుకు తూములు ఎక్కడ అవసరం ఉన్నాయి? కాల్వల నిర్మాణం ఎక్కడ అవసరం ఉంది? తదితర అంశాలపై నివేదికలు రెడీ చేయాలని ఆదేశించారు. గంగాధర మండలం నారాయణపూర్ చెరువు, కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువు, పోతారం చెరువు ద్వారా గ్రామాల్లో నీటి పారుదల ఉంటుదన్నారు. నియోజకవర్గంలో 14తూములు మంజూరయ్యాయని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
- June 4, 2020
- కరీంనగర్
- తెలంగాణ
- CHOPPADANDI
- PLANNING COMMITEE
- ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
- బోయినిపల్లి వినోద్ కుమార్
- Comments Off on ప్రతి చెరువు నిండాలె