సారథి న్యూస్, నల్లగొండ: కనిపించని శత్రువైన కరోనాపై ఉమ్మడిగా పోరాటం చేద్దామని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటించడమే మార్గమన్నారు. గురువారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఇతర ప్రజాప్రతినిధులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సూర్యాపేటకు మార్కెట్‌కు చేరడం మన దురదృష్టమన్నారు. అయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ మహమ్మారి నియంత్రణపై పౌష్టికారం, ఇతర జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
- April 23, 2020
- తెలంగాణ
- కరోనా
- జగదీశ్‌రెడ్డి
- మంత్రి
- సూర్యాపేట
- Comments Off on ప్రజలకు జాగ్రత్తలు చెప్పండి