Breaking News

పుజారా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు

న్యూఢిల్లీ: లాక్​డౌన్​ తర్వాత టీమిండియా క్రికెటర్లు ఒక్కొక్కరుగా ప్రాక్టీస్​లోకి దిగుతున్నారు. తాజాగా మిడిలార్డర్ బాట్స్​మన్​ చతేశ్వర్ పుజారా.. ఔట్ డోర్​లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. తన సొంత ఊరిలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాడు. ‘మళ్లీ బ్యాట్ పట్టా. సుదీర్ఘంగా విరామం వచ్చినా.. స్టాన్స్ తీసుకుంటుంటే నిన్నటి రోజులాగానే అనిపిస్తోంది’ అని పుజారా వ్యాఖ్యానించాడు.