సారథి న్యూస్, మెదక్: పారిశుద్ధ్యం అందరి బాధ్యత అని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని సోమవారం మెదక్ మున్సిపాలిటీలో ప్రారంభించారు. మొదటిరోజు 1, 2, 3, 4 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. పట్టణ పరిధిలోని ఔరంగాబాద్, అవుసులపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో పనులను పరిశీలించారు. బహిరంగంగా చెత్త వేస్తే ఊరుకునే లేదని, ఫైన్ విధించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమం ప్రతిరోజూ నాలుగు వార్డుల చొప్పున 8 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం 5, 6, 7, 8 వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు కిషోర్, విశ్వం, ఆర్కే శ్రీనివాస్, జయరాజ్, కొరివి రాములు, శ్రీధర్ యాదవ్, అధికారులు బాలసాయిగౌడ్, రమేష్ పాల్గొన్నారు.
- June 1, 2020
- మెదక్
- లోకల్ న్యూస్
- MEDAK AJC
- SANITATION
- SPECIAL DRIVE
- మెదక్ మున్సిపాలిటీ
- శానిటేషన్ స్పెషల్ డ్రైవ్
- Comments Off on పారిశుద్ధ్యం అందరి బాధ్యత