Breaking News

నేలకొరిగిన అరుదైన వృక్షం

నేలకొరిగిన బూరుగ వృక్షం

కోదాడ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అశోక్ నగర్ వద్ద ఉన్న ఆసియాలో అరుదైన ఆఫ్రికన్ జాతికి చెందిన వృక్షం అదన్ సోనియా డిజిటేటన్ లీన్(బూరుగ వృక్షం) నేలకొరిగింది. రోడ్డు విస్తరణకు అడ్డం రాకపోయినా కావాలని కూల్చేశారని పర్యావరణ వేత్తలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి వృక్ష జాతిని సందర్శనా ప్రదేశాలుగా మార్చి పర్యాటకులకు, విద్యార్థులకు వాటి ప్రాముఖ్యం తెలుపుతూ అందుబాటులో ఉంచేలా చూడాల్సిన ప్రభుత్వ అటవీ శాఖ యంత్రాంగం పట్టించుకోకపోతే భావితరాలు ఎలా విజ్ఞానం పొందుతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 8నుంచి అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం రోజు ఆ చెట్టుకు పూల మాలలు వేసి చెట్టు ప్రాముఖ్యాన్ని తెలిసేలా కొల్లు లక్ష్మి నారాయణ, కుదరవెళ్లి బసవయ్య, గింజల అప్పిరెడ్డి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా చివరకు అధికారుల స్పందన కరువై వృక్షం నెలకొరిగింది.