మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల గ్రామం సోమవారం కృష్ణానదిలో నాటుపడవ మునిగి ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి గల్లంతయ్యారు. వీరిని కర్ణాటకలోని కురంగడ్డ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. నిత్యావసర సరుకుల కోసం పంచదేవ్ పాడుకు వచ్చి నదిని దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న నాటుపడవ మునిగింది. అందులో ఉన్న 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైనవారిని సుమలత, రోజా, చిన్నక్క, నర్సమ్మగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
- August 17, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- MAKTHAL
- NARAYANAPET
- NATUPADAVA
- నారాయణపేట
- మక్తల్
- మహబూబ్ నగర్
- Comments Off on నాటుపడవ బోల్తా.. నలుగురు గల్లంతు