సారథి న్యూస్, హుస్నాబాద్: అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మరణం సీపీఐకి తీరనిలోటని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేష్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి భూపతిరెడ్డి అమరుల భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. నాగేశ్వరరావు రైతు, కూలీల హక్కుల సాధనకు సమరశీల పోరాటాలు చేశాడని గుర్తుచేశారు. రైతు సంఘం జిల్లా సహయ కార్యదర్శి హన్మిరెడ్డి, రాజారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వనేశ్, కోమురయ్య, భాస్కర్, సుదర్శనాచారి, లక్ష్మినారాయణ, ఏఐవైఎఫ్ జిల్లా సహయకార్యదర్శి రాజు కుమార్, కుమారస్వామి, మల్లారెడ్డి, సంజీవరెడ్డి నాగేశ్వరరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- May 23, 2020
- కరీంనగర్
- మెదక్
- లోకల్ న్యూస్
- CPI
- HUSNABAD
- అఖిలభారత కిసాన్ సభ
- సీపీఐ
- Comments Off on నాగేశ్వరరావు మృతి తీరని లోటు