న్యూఢిల్లీ: ప్రపంచకప్ 2007 టీ20 జట్టుకు దూరంగా ఉండేలా సచిన్, గంగూలీని.. నాటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఒప్పించాడని అప్పట్లో టీమ్ మేనేజర్‌గా ఉన్న లాల్‌చంద్ రాజ్‌పుత్ తెలిపాడు. యువకులకు అవకాశం ఇవ్వడం కోసమే అలా చేశాడన్నాడు. దీనికి సచిన్, గంగూలీ పెద్ద మనసులో అంగీకరించారన్నాడు. ‘అప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. కొంత మంది ఆటగాళ్లు అక్కడి నుంచి నేరుగా జొహనెస్‌బర్గ్ వెళ్లారు. యువ క్రికెటర్లకు అవకాశం కోసం సీనియర్లు తప్పుకోవాలని అనుకున్నారు. దీనికి ద్రవిడ్ చొరవ చూపెట్టాడు. దిగ్గజాలు అలానే ఉంటారు. కానీ ఆ ప్రపంచకప్‌లో ఆడనందుకు తర్వాత వాళ్లు చాలా బాధపడ్డారు. అయితే ఓ గొప్ప టీమ్‌కు అక్కడే పునాదులు వేసేందుకు వీళ్లు సచిన్, ద్రవిడ్, గంగూలీ చూపిన ధైర్యం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి’ అని లాల్‌చంద్ వ్యాఖ్యానించాడు.
- June 30, 2020
- Top News
- CRICKET
- GANGULLY
- SACHIN
- గంగూలీ
- ద్రవిడ్
- వరల్డ్ కప్
- సచిన్
- Comments Off on ద్రవిడే ఒప్పించాడు