![దూరం.. దూరం ఉండాలె](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/mbnr.28.jpeg?fit=1280%2C850&ssl=1)
సారథి న్యూస్, మహబూబ్ నగర్: రైతు బజార్ లలో వినియోగదారులతో పాటు కూరగాయలు అమ్మేవారు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని మహబూబ్ నగర్ కలెక్టర్ ఎస్.వెంకటరావు సూచించారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన రామయ్య బౌలి, న్యూటౌన్ రైతు బజార్ ను ఆకస్మికంగా తనిఖీచేసి క్రయవిక్రయాలను పరిశీలించారు.
విక్రయదారులు, కొనుగోలుదారులతో నేరుగా మాట్లాడారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లను కచ్చితంగా కట్టుకోవాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ కమిషనర్ సురేందర్ ఉన్నారు.