జోహన్స్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌కు కరోనా భయం పట్టుకున్నది. తాము నిర్వహించిన మాస్ట్ పరీక్షల్లో ఏడుగురికి కరోనా ఉన్నట్టు తేలడందో బోర్డు ఆందోళనలో పడింది. నాన్ కాంటాక్ట్ క్రీడలను మొదలుపెట్టేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. బోర్డు తమ ఆటగాళ్లను ఒక చోటికి చేర్చింది. కొంత మంది కాంట్రాక్ట్ ప్లేయర్లు, ఫ్రాంచైజీ ఆటగాళ్లతో కలిపి మొత్తం 100 మంది కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో ఏడుగురు వైరస్ బారిన పడినట్టు తెలిసింది. అయితే ఈ ఏడు మందిలో ప్రధాన ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారా అన్న విషయాన్ని క్రికెట్ బోర్డు బహిర్గతం చేయలేదు.
- June 23, 2020
- Archive
- క్రీడలు
- CARONA
- SOUTH AFRICA
- TESTS
- ఆందోళన
- క్రికెట్ బోర్డు
- Comments Off on దక్షిణాఫ్రికా జట్టులో ఏడుగురికి కరోనా