- విజయవాడ హైవేపై ఘటన
సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: డీసీఎం, బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం..
విజయవాడ హైవే(ఎన్హెచ్ 65) పై మల్కాపురం వద్ద ఆగిన డీసీఎంను హైదరాబాద్ వైపు మామిడికాయల లోడ్ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది.
ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్ అజయ్ కుమార్(20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.