– ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్
మెల్ బోర్న్: టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ దక్కినప్పటికీ ఇండియా గడ్డపై టీమిండియాను ఓడించడమే తమ అసలు టార్గెట్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. లేదంటే తమ టాప్ ప్లేస్ మరోసారి ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరించాడు.
‘ఈ ర్యాంక్‌లను ఎలా ప్రకటించారో మేం గుర్తించగం. అయితే ఈ సమయంలో టాప్ ప్లేస్ రావడం మా ముఖాల మీదకు నవ్వు తెప్పించింది. మేం కోరుకున్నట్లుగా మంచి టీమ్ గా తయారుకావడానికి చాలా శ్రమించాం. కానీ రెండేళ్లుగా మైదానంలోపలా, వెలుపలా మా ప్రదర్శన అంతా బాగాలేదు. అయినా సరే మేం చేరాల్సిన లక్ష్యాలు అలాగే ఉన్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ సాధించాలి.
ఇండియాను వాళ్ల గడ్డపై ఓడించాలి. వాళ్లు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఓడించాం. అత్యుత్తమైన టీమ్ ను ఓడిస్తేనే మనం ఉత్తమమని తెలుస్తుంది’ అని లాంగర్ వ్యాఖ్యానించాడు. నంబర్ వన్ ర్యాంక్ దక్కడం గొప్ప విషయమే అయినా ఈ స్థానంలో ఉండడం వల్ల ఎప్పుడూ వేటాడడం తప్పదన్నాడు. ఇక ఫించ్ నేతృత్వంలోని వైట్ బాల్ టీమ్ టీ 20 వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.