కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు…
సారథి న్యూస్, వనపర్తి: కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. మంగళవారం ఆయన వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరి, సంగినేనిపల్లి, తూముకుంట, బొల్లారం, వీపనగండ్ల గ్రామాల ప్రజలతో మాట్లాడారు. ఎక్కువ సార్లు చేతులు శుభ్రం చేసుకోవడం, నోటికి రుమాలు కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే సంగినేనిపల్లి గ్రామంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీచేశారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఉన్న రైతు ధాన్యం కోనుగోలు కేంద్రాల్లో రైతులు హమాలీలతో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా సరిగ్గా తూకం వేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ కమలేశ్వర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.