సారథి న్యూస్,ములుగు: చెట్లే మానవజాతికి ప్రాణాధారమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఆరోవిడుత హరితహారంలో భాగంగా శుక్రవారం ఆమె ములుగు జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మొక్కలు నాటారు. ములుగు మండలం జాకారం, బండారుపల్లి, వెంకటాపూర్ మండలంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. అటవీ సంపదను పెంచేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని తలపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే సీతక్క, అటవీ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి, ఐటీడీఏ పీవో హన్మంతు, ఏఎస్పీ సాయిచైతన్య, ములుగు డివిజనల్ అటవీఅధికారి నిఖిత, ములుగు రేంజ్ అటవీఅధికారి రామ్మోహన్, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హన్మంత్ కె జండగే, అధికారులు కే రమాదేవి, ఏ పారిజాతం తదితరులు పాల్గొన్నారు.
- June 26, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- HARITHAHARAM
- MINISTER
- PLANTS
- SATYAVATHI
- మంత్రి
- ములుగు
- Comments Off on చెట్లే ప్రాణాధారం