సారథి న్యూస్, చిన్నశంకరంపేట/ నిజాంపేట: సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని గౌడసంఘం నేతలు కొనియాడారు. మంగళవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 370 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోనూ గౌడసంఘం ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ పెత్తందారివ్యవస్థపై పోరాడిన యోధుడని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు పట్లోరి రాజు, స్వతంత్ర కుమార్‌గౌడ్, తాళ్ల రాజు గౌడ్, నాయకులు బండారు స్వామి, బాగగౌని సురేశ్‌గౌడ్, నాగరాజుగౌడ్, వేణుగౌడ్, మహేశ్‌గౌడ్, వంశీ గౌడ్, చింటూగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- August 18, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- jaynthi
- NIZAMPET
- సర్వాయి పాపన్న
- Comments Off on ఘనంగా సర్వాయి పాపన్న జయంతి