ఎగిరిన అరుణపతాకం
సారథి న్యూస్, రంగారెడ్డి : మేడేను పురస్కరించుకుని తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని 23వ వార్డులో సీపీఎం ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ గ్రామ కార్యదర్శి టి.నర్సింహ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పార్టీ సీనియర్ నాయకులు బి.శంకరయ్య సీపీఎం జెండాను ఆవిష్కరించారు.
అనంతరం కార్యదర్శి నర్సింహ మాట్లాడుతూ పని గంటలు తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని తమ హక్కుల సాధనం కోసం జరిపిన పోరాటంలో పెట్టుబడిదారుల చేతుల్లో ప్రాణాలను సైతం లెక్కజేయకుండా కార్మికులు పోరాడారని తెలిపారు.
పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం, ప్రజానీకం ముందుకు సాగాలన్నారు. లాక్ డౌన్ సమయంలో తినడానికి తిండి లేక, ఇబ్బందులు పడుతున్న పేదలను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శులు ఐ.భాస్కర్, పి. శ్రీనివాస్, సీపీఎం మండల నాయకులు శారద, ఎన్. రత్నమ్మ, మాజీ వార్డు మెంబర్ భూక్య సుజాత, హనుమమ్మ, ఎల్. నర్సింహా, సత్యం, ఐ.కృష్ణ, అంజి, రవీందర్, భారతి పాల్గొన్నారు.