సారథి న్యూస్, వరంగల్: సీఎం కె.చంద్రశేఖర్ రావు గీత కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. హన్మకొండలోని హంటర్ రోడ్ లో నూతనంగా నిర్మించిన కాకతీయగౌడ హాస్టల్ భవనాన్ని వారు సోమవారం ప్రారంభించారు. మొదటి నుంచీ గౌడ సామాజికవర్గం సామాజిక చైతన్యంలో ముందు వరుసలో నిలిచిందన్నారు. భవనం ప్రారంభోత్సవాన్ని 50వేల మందితో నిర్వహిద్దామని అనుకున్నామని, కరోనా సమయంలో అది సాధ్యంకాలేదని అన్నారు. ప్రతిఒక్కరూ సామాజికవర్గం అభివృద్ధికి కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మేయర్ గుండా ప్రకాష్, కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
- June 15, 2020
- తెలంగాణ
- వరంగల్
- CM KCR
- YERRABELLI
- గీత కార్మికులు
- గౌడ కులస్తులు
- వరంగల్
- Comments Off on గీతకార్మికులకు ఎన్నో పథకాలు