అలనాటి లెజండరీ నటి శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషీ అని అందరికీ తెలిసిందే. ఆల్ రెడీ జాన్వీ కపూర్ బాలీవుడ్లో ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసి కుర్రకారు గుండెల్లో ధడక్ ధడక్ అంటూ రైళ్లు పరుగెత్తించింది. ఇప్పుడామె చెల్లి ఖుషీ సినిమాలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్న ఈ అమ్మడు త్వరలోనే ఓ మాంచి సినిమాతో రానుందట. అక్కలాగే ఖుషీ కూడా సోషల్ మీడియాలో అభిమానులకు టచ్‌లోనే ఉంటుంది.
లాక్ డౌన్ సమయంలో ‘క్వారంటైన్ టేప్స్’ పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేసింది ఖుషీ. ‘చిన్నప్పుడు అందరూ తనని అమ్మాలా, అక్కలా అందంగా లేవని వెక్కించేవారట. అప్పుడు తను మానసికంగా చాలా బాధపడేదట. కానీ ఇప్పుడలా కాదు నన్ను నేను చాలా మార్చుకున్నాను. నా డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్నా, నన్ను నేను ఎలా ప్రేమించుకోవాలో తెలుసుకున్నా అంటోంది’ ఆ టేపులో.. అంతేకాదు మీరు కూడా మీలాగే ఉండండి. అలా ఉండడానికే ప్రయత్నించండి అంటోంది. ఖుషీ ఇలా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టిచూస్తే త్వరలోనే సినిమాల్లో సందడి చేయనుందని అనిపిస్తోంది. అలా అయితే అక్కాచెల్లెలను చూసేందుకు అభిమానులు రెడీ అవ్వాల్సిందే.