Breaking News

క్యాతన్​పల్లి ఇక రామకృష్ణాపూర్

  • September 15, 2022
  • Archive
  • Comments Off on క్యాతన్​పల్లి ఇక రామకృష్ణాపూర్
క్యాతన్​పల్లి ఇక రామకృష్ణాపూర్

పేరు మార్పునకు అసెంబ్లీలో బిల్లు పాస్

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: సిరుల తల్లి సింగరేణి గర్భం నుంచి ఉద్భవించిన ఊరు రామకృష్ణాపూర్ అని చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో క్యాతన్​ పల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్పునకు అసెంబ్లీలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ బిల్లు పాస్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలోని టీఆర్ఎస్​నాయకులు, కార్యకర్తలు బాణాసంచాలు కాల్చి, స్వీట్లను పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే బాల్కసుమన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య మాట్లాడుతూ ఎంతో గొప్ప చరిత్ర కలిగిన పట్టణానికి పూర్వవైభవం తీసుకొచ్చారని, మున్సిపాలిటీ పేరు మార్చడంతో పట్టణం తిరిగి పురుడు పోసుకుందని, పట్టణ అస్తిత్వాన్ని తిరిగి నిలిపిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ను అభినందించారు. అసెంబ్లీలో మున్సిపాలిటీ పేరు మార్పునకు బిల్లు పాస్ చేసినందుకు కృషి చేసిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే బాల్క సుమన్,పట్టణ టిఆర్ఎస్ నాయకులు, వర్తక,వాణిజ్య సముదాయాల వ్యాపారులు, కుల సంఘాలు,యూనియన్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ నాయకులు, వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ కార్యక్రమంలో విద్యార్థులు
ఇదిలాఉండగా, అధికార పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములు చేయడం ఏమిటని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. క్లాసెస్​నడుస్తున్న సమయంలో విద్యార్థులను తీసుకొచ్చి, గంటలకొద్దీ రోడ్డుపై నిలబెట్టి వారితో కలిసి నాయకులు కార్యక్రమాలను చేపట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ మేధావులకు మండిపడ్డారు.