Breaking News

కోహ్లీయే బెస్ట్​ ఆటగాడు

కోహ్లీయే బెస్ట్​ ఆటగాడు
  • ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ చాపెల్‌

న్యూఢిల్లీ: ప్రస్తుత క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయే అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయపడ్డాడు. క్రికెట్‌ పుస్తకాల్లో ఉండే షాట్లు, అద్భుతమైన ఫిట్‌నెస్‌, తిరుగులేని రికార్డులతో కోహ్లీ అందరికంటే ముందున్నాడని చెప్పాడు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా స్మిత్‌, విలియమ్సన్‌, రూట్‌ ఇలా ఇప్పుడున్న గ్రూప్‌లో కోహ్లీయే అత్యుత్తమం. ఇందులో ప్రశ్నించడానికి ఏమీ లేదు. మూడు ఫార్మాట్లలో అతని రికార్డులు అమోఘం. షార్ట్‌ ఫార్మాట్‌లో అయితే తిరుగేలేదు. కోహ్లీ బ్యాటింగ్‌ అప్రోచ్‌ చాలా బాగుంటుంది. ఫ్యాన్సీ షాట్స్‌ ఎందుకు ఆడవని ఓ ఇంటర్వ్యూలో నేను అతన్ని ప్రశ్నించా. టీ20లకు మాత్రమే సరిపోయే ఇన్నోవేటివ్‌ షాట్లను కూడా అతను కొట్టడు. కేవలం క్రికెట్‌ పుస్తకాల్లో ఉన్న షాట్లను యథావిధిగా దించేస్తాడు. అదే అతని బలం. కొత్త తరహా షాట్లు ఆడడంతో ఆటలో ఎక్కువ కాలం ఉండలేమని చెప్పాడు.

షార్ట్‌ ఫార్మాట్‌లో నేను కలిసి ఆడిన బెస్ట్‌ ప్లేయర్‌ వివ్‌ రిచర్డ్స్‌. అతను సాధారణ క్రికెటింగ్‌ షాట్సే ఆడతాడు. బాల్‌ను చాలా బాగా ప్లేస్‌ చేస్తూ వేగంగా పరుగులు సాధిస్తాడు. సేమ్‌ కోహ్లీ కూడా అంతే. సంప్రదాయబద్దమైన క్రికెట్‌ షాట్లను అద్భుతంగా ఆడతాడు’ అని చాపెల్‌ కితాబిచ్చాడు. వికెట్ల మధ్య పరుగెత్తి విధానం, ఫిట్‌నెస్‌లో కోహ్లీని మించిన మొనగాడు లేడన్నాడు. ఫిట్‌గా ఉండేందుకు అతను శ్రమించే విధానం అమేజింగ్‌ అని చెప్పాడు. కెప్టెన్సీలోనూ విరాట్‌ సూపర్బ్‌ అని ప్రశంసించాడు. ఓటమికి భయపడని నైజం అతడిని సూపర్‌ కెప్టెన్‌ను చేసిందన్నాడు.