Breaking News

ఐపీఎల్ జరిగితేనే మంచిది

  • టీమిండియా మాజీ కెప్టెన్​ అనిల్ కుంబ్లే


న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏదో ఓ దశలో ఐపీఎల్ జరిగితేనే మంచిదని టీమిండియా మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ కోరుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్​లు నిర్వహించినా ఫర్వాలేదని కుంబ్లే అన్నాడు. ఈ ఆలోచన తప్పు కాదన్నాడు. ‘ఐపీఎల్ జరగాలని నేను బలంగా కోరుకుంటున్నా. అంతర్జాతీయ షెడ్యూల్​ను సమీక్షిస్తే ఈ ఏడాది లీగ్​ కు సమయం లభిస్తుందని భావిస్తున్నా.

ఒకవేళ ప్రేక్షకులకు అనుమతి లేకుంటే.. నాలుగు వేదికల్లో మ్యాచ్​లన్నీ నిర్వహిస్తే బాగుంటుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు’ అని కుంబ్లే వ్యాఖ్యానించాడు. ఎక్కువ స్టేడియాలు అందుబాటులో ఉన్న ఒకే నగరంలో ఐపీఎల్​ను నిర్వహిస్తే చాలా బాగుంటుందని వీవీఎస్ అన్నాడు. ఈ విషయంలో బీసీసీఐ, వాటాదారులు ఆలోచించాలన్నాడు. దీనివల్ల వైరస్ ముప్పుతో పాటు ప్రయాణ సమయం బాగా తగ్గుందని చెప్పాడు.