సారథి న్యూస్, అనంతపురం: ఏపీలో మద్యం ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ అనుమతితో ఏప్రిల్ 3 నుంచి 20 డిస్టలరీలు తెరుచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మద్యం తయారీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
మద్యం తయారీ కంపెనీలు పూర్తిగా శానిటైజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు నిర్దేశించింది. అలాగే కంపెనీలో కార్మికులు సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని పేర్కొంది. మద్యం తయారీ కంపెనీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు వేర్వేరుగా ఉండాలని పేర్కొంది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరేట్ నిషేధిస్తున్నట్లు పేర్కొంది. లిఫ్టులు ఉపయోగించొద్దని స్పష్టం చేసింది.