Breaking News

ఎస్సై ఓబుల్ రెడ్డిని సస్పెండ్ చేయండి

  • October 21, 2022
  • Top News
  • Comments Off on ఎస్సై ఓబుల్ రెడ్డిని సస్పెండ్ చేయండి
ఎస్సై ఓబుల్ రెడ్డిని సస్పెండ్ చేయండి


సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తన కుమారుడిని అకారణంగా దుర్భాషలాడి దూషించిన బిజినేపల్లి ఎస్సై కృష్ణఓబుల్ రెడ్డిని సస్పెండ్ చేయాలని నాగర్ కర్నూ్ల్ జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి శుక్రవారం ఎస్పీ పి.మనోహర్ కు ఫిర్యాదుచేశారు. 20వ తేదీ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో తన కుమారుడు గణేశ్ కోళ్ల దాణా వెహికిల్ ను తీసుకొస్తుండగా ఎస్సై ఓబుల్ రెడ్డి ఆపి తన పేరు చెప్పినా కూడా చెంపదెబ్బ కొట్టడమే కాకుండా స్టేషన్ కు తీసుకెళ్లి రాయలేని పదజాలంతో దూషించారని వినతిపత్రంలో పేర్కొ్న్నారు. అంతేకాకుండా బూటుకాలితో తన్నుతూ ఎస్సీ అయితే ఎంట్రా? అంటూ జులుం ప్రదర్శించారని తెలిపారు. అతని వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.