Breaking News

ఆకలి తీర్చడం గొప్పకార్యం

సరుకులు పంపిణీ చేస్తున్న ఏఎస్పీ నాగరాజు

రుకులు పంపిణీ చేస్తున్న ఏఎస్పీ నాగరాజు

సారథి న్యూస్, మెదక్: కష్టకాలంలో పేదల ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని మెదక్ అడిషనల్ ఎస్పీ నాగరాజు అన్నారు. లాక్ డౌన్ కారణంగా నిత్యావసర సరుకులు దొరక్క పేద కుటుంబాలకు చెందిన అనేక మంది అర్ధాకలితో రోజులు గడుపుతున్న విషయం గుర్తించిన  మెదక్ జిల్లా పోలీస్ అధికారులు దాతల సహకారంతో నిత్యావసర సరుకులను సమకూర్చారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్, హవేలి ఘన పూర్​, మెదక్ రూరల్, కుల్చారం,  పాపన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదొందల మందికి పదికేజీల బియ్యం, పప్పులు, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కళ్లల్లో చూసిన ఆనందం మాటల్లో వర్ణించలేమన్నారు. కార్యక్రమలో మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, మెదక్ టౌన్ సీఐ వెంకట్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్, ఆర్ఐ  సూరపనాయుడు, మెదక్ రూరల్ ఎస్సై కిష్టారెడ్డి, హవేలి ఘనపూర్ ఎస్సై శేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్, పాపన్నపేట ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.