Breaking News

అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

సారథి న్యూస్, మహబూబాబాద్: జిల్లాలోని పశువైద్యశాఖలో ఖాళీగా ఉన్న అటెండెంట్ పోస్టుల భర్తీకి అవుట్​సోర్సింగ్​విధానంలో పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్​వీపీ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు పశువుల హాస్పిటల్స్​లో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఖాళీగా ఉన్న మూడు పోస్టులకు షెడ్యూల్ తెగలకు చెందినవారు మాత్రమే అర్హులని, పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు వెటర్నరీ పాలిటెక్నిక్ డిప్లమో లేదా ఇంటర్మీడియట్ డైరీ సైన్స్ చదివి, గోపాలమిత్రులుగా పనిచేసి ఉండాలని సూచించారు. mahabubabad.telangana.gov.inలో నవంబర్​ 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను స్వీకరించబోమని స్పష్టంచేశారు.