సారథి, జగిత్యాల: అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపుమేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపునకు నిరసనగా జగిత్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుండ మధు మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డివిరిచేలా ఉన్నాయని అన్నారు. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నక్క జీవన్, ఎండీ నేహల్, బాస ప్రకాశ్, గంగాధర్, రాజ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, కాస సంజీవ్, లైశెట్టి విజయ్, జగిత్యాల యూత్ అసెంబ్లీ ప్రెసిడెంట్ బాపు రెడ్డి, రియాజ్, అనుదీప్, భీరం రాజేష్, సలీం, హరీష్, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- June 6, 2021
- Archive
- కరీంనగర్
- CARONA
- JAGITYALA
- YOUTH CONGRESS
- కరోనా
- జగిత్యాల
- యూత్ కాంగ్రెస్
- Comments Off on యూత్ కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన