సారథి న్యూస్, ఏటూరునాగారం: ఓ యువకుడు కరెంట్ స్తంభం ఎక్కి హల్చల్ సృష్టించాడు. శుక్రవారం ఈ సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారిఘనపురం గ్రామంలో సంచలనం రేకెత్తించింది. ఇదే గ్రామానికి చెందిన సాబీర్ కన్నాయిగూడెం మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ సంస్థలో దినసరి కూలీగా పనిచేసేశాడు. ఆరునెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంట్లో కుటుంబ అవసరాల కోసం భార్యతో గొడవ జరిగేది. దీంతో మనస్తాపానికి గురైన సాబీర్ మద్యం తాగి విద్యుత్ స్తంభం ఎక్కి సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇదిలాఉండగా, మండల కేంద్రంలో కరెంట్ వైర్ల మరమ్మతు పనుల కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రమాదమేమీ జరగకపోవడంతో స్థానికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు వచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు.
- March 13, 2021
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- eturunagaram
- KANNAIGUDEM
- RWS
- ఆత్మహత్యం
- ఆర్డబ్ల్యూఎస్
- ఏటూరునాగరం
- కన్నాయిగూడెం
- Comments Off on స్తంభమెక్కి యువకుడి హల్చల్