సారథి, పెద్దశంకరంపేట: కరోనాతో యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని జంబికుంట గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యువకుడు మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. కరోనా పరీక్ష చేయించుకుని ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. అతని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలుగు పాజిటివ్ కేసులు ఒకేరోజు 25 మందికి పరీక్షలు చేయగా అందులో నాలుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి డాక్టర్ పుష్పలత తెలిపారు.
- May 18, 2021
- Archive
- కరీంనగర్
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- COVID19
- jambikunta
- PEDDASHANKARAMPET
- కరోనా
- కొవిడ్ 19
- జంబికుంట
- పెద్దశంకరంపేట
- Comments Off on కరోనాతో యువకుడి మృతి