Breaking News

మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం

మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం

21 ఏప్రిల్ 2021: బుధవారం
మేషం: ఉద్యోగులకు అధికారుల నుంచి సమస్యలు ఉంటాయి. కాంట్రాక్టర్లకు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి చేపట్టినపనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేక అభిమానం కలుగుతుంది. బంధువులను కలుసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికి ప్రయత్నిస్తారు.
వృషభం: ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. పరిశోధనాత్మక విషయాలకు ఆసక్తి చూపుతారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనుల యందు జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికమవుతుంది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మిథునం: ప్రభుత్వ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. సంతాన విద్యా వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. ప్రయాణాలలో నూతనపరిచయాలు కలుగుతాయి ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.
కర్కాటకం: వ్యాపారాల్లో శత్రు సమస్యలు నుంచి బయటపడతారు. స్త్రీలకు కళ్లు, తల నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ధన పరమైన ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఎదుటివారిని గమనించి తదనుగుణంగా సంభాషించండి. షాపింగ్‌లో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రాజకీయాల్లో వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.

సింహం: సోదరులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ పట్టుదల, అంకితభావం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ప్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు కలసి వస్తాయి. అవసరానికి ఇతురుల సహాయం అందుతుంది. గృహవాతావరణం సంతోషకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగపరంగా సొంత నిర్ణయాలు అమలుచేయడం మంచిది. శత్రువులు మిత్రులుగా మారి సహకారాలు అందిస్తారు. ప్రముఖులను కలుసుకుని వారితో ఉల్లాసంగా గడుపుతారు.

కన్య: ఇంటాబయటా అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల్లో స్వల్పవివాదాలు ఉంటాయి. వృత్తుల వారికి సదావకాశాలు లభించినా ఆర్థికంగా ఆశించినంత సంతృప్తి ఉండదు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలు సొంత ఆలోచనలతో చేయడం మంచిది. ఉద్యోగంలో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఏదైనా స్థిరాస్తి అమ్మకానికై చేయు యత్నాలు వాయిదావేయడం మంచిది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి సఫలీకృతులవుతారు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.

తుల: చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల మాటల వలన మానసిక అశాంతి కలుగుతుంది. మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు. పత్రిక సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయ. కుటుంబసభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉన్నత విద్యల నిమిత్తం చేసే విదేశీయాన యత్నం ఫలిస్తుంది. స్త్రీల కళాత్మక, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది.

వృశ్చికం: మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రుల రాకతో ఇంటిలో సందడి కనిపిస్తుంది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక లాభం కలుగుతుంది. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల సహాయం అందుతుంది. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా ఉండగలదు. ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి. ఖర్చులు అధికమైనా ఆదాయానికి లోటు అంతగా ఉండదు.

ధనుస్సు: ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఏసీ, కూలర్ మెకానిక్ రంగాల్లో వారికి సంతృప్తితో పాటు పనిభారం కూడా అధికమవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాల్లో భాగస్తుల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. మంచికిపోతే చెడు ఎదురయ్యే పరిస్థితులు ఎదుర్కొంటారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు.

మకరం: ఉద్యోగమున అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వస్త్రవ్యాపారులకు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. వివేచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. నకిలి డాక్టర్లకు మంచికాలం వచ్చింది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాలనుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. ఇతరులు మీ పట్ల ఆకర్షితులవుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. చేతి వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి.

కుంభం: ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. బ్యాంకు లావాదేవీలకు అనుకూలం. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులుంటాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఉద్యోగాల్లో బాధ్యతలు మరింత అధికమవుతాయి. వృథా ఖర్చులు చేస్తారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. విద్యుత్ రంగంలో వారికి పనిభారం అధికం. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి.

మీనం: స్థిరాస్తి వ్యవహారాల్లో పెద్దలతో వివాదాలు ఉంటాయి. ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. విద్యుత్ వస్తువుల పట్ల ఏకాగ్రత చూపుతారు. మార్కెటింగ్ రంగంలోని వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. చేపట్టిన పనులు కష్టసాధ్యంతో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల కోపానికి గురవుతారు. ప్రయాణాలు వాయిదాపడతాయి. సంతాన విద్యాప్రయత్నాలు వృథాగా మిగులుతాయి. పనులకు ఆటంకాలు కల్పించాలనుకున్నవారు సైతం అనుకూలంగా మారతారు. భాగస్వామిక వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

:: బ్రహ్మశ్రీ మహేష్ విశ్వకర్మ గురూజీ
జ్యోతిష్య పండితులు
సెల్​ నం.95020 59649