సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం పెద్దశంకరంపేట పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ మహిళా దేశానికి ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. మంచి అవకాశాలు కల్పిస్తే మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారని అన్నారు. ఆడబిడ్డల వివాహానికి సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష అందిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, ఎంపీటీసీలు స్వప్నరాజేష్, వీణాసుభాష్ గౌడ్, దత్తు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, పీఆర్టీయూ రాష్ట్ర, జిల్లా మండల బాధ్యులు పొమ్యానాయక్, కేవీ రవీందర్, రామచంద్రాచారి, రఘునాథ్, ప్రసన్న పాల్గొన్నారు.
- March 9, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- CM KCR
- KALYANALAKSHMI
- MLA BHUPALREDDY
- NARAYANAKHED
- ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
- కళ్యాణలక్ష్మి
- నారాయణఖేడ్
- సీఎం కేసీఆర్
- Comments Off on మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి