సారథి న్యూస్, జడ్చర్ల: మహబూబ్నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ముకురాల శ్రీహరికి మద్దతుగా జడ్చర్ల, మహబూబ్నగర్లో ‘ఇంటింటికీ ప్రశ్నించే గొంతుక’ అనే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం చేశారు. పట్టభద్రులు, విద్యార్థులు, మేధావులు, వివిధ రంగాల ఉద్యోగులను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. నిరంతరం ప్రజల కోసం ఉద్యమం చేసే పాలమూరు ముద్దుబిడ్డ పోరాట యోధుడు ముకురాల శ్రీహరిని శాసనమండలికి పంపించేందుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని పలువురు ప్రకటించారు. కార్యక్రమంలో ప్రచార కమిటీ నాయకులు భావండ్లపల్లి చెన్నయ్య, గోపి, కేశవులు, కలకొండ విక్రమ్, త్యాగరాజు, శివప్రసాద్ పాల్గొన్నారు.
- March 4, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- MAHABUNAGAR
- MLC ELECTIONS
- PALAMUR
- ఎమ్మెల్సీ ఎన్నికలు
- పాలమూరు
- శ్రీహరి
- Comments Off on ప్రశ్నించే గొంతుకను గెలిపించండి