- అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
- హాజరుకాని వారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయండి
- సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
సామాజిక సారథి, తిమ్మాజిపేట: మూడు నెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావేశానికి హాజరుకాని అధికారులపై తీర్మానం రాసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సూచించారు. శనివారం ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన తిమ్మాజిపేటలోని రైతువేదికలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి కావాల్సిన పనులు చేసి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంపీపీ దృష్టి గాని తన దృష్టికి తీసుకురావాలన్నారు. స్కూళ్లలో ముందుగా బాలికలకు టాయిలెట్స్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లకు వెళ్లి సమస్యలపై ఫొటోలను తనకు పెట్టాలని ఎంఈవో శ్రీనివాసులుకు సూచించారు. గ్రామాల్లో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఇవ్వడం లేదని, ఫోన్ లిఫ్ట్ చేస్తే స్పందించడం లేదని పలువురు సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. విద్యుత్ సమస్యపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయిస్తానని అన్నారు. వ్యవసాయశాఖ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో విధిగా రైతుల వద్దకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్ రెడ్డి, తహసీల్దార్సరస్వతి, ఎంపీడీవో కరుణశ్రీ, ఎంపీవో బ్రహ్మచారి, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీ లీలావతితో పాటు పలు శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
మురళి కుటుంబసభ్యులకు పరామర్శ
తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన కటిక మురళి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి శనివారం పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు లీలావతి, నెల్లూరు ఎంపీ రవీంద్రనాథ్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాసులు పలువురు నాయకులు ఉన్నారు.