సారథి, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో టీఆర్ఎస్వీ నాయకుడు నరేష్ రావన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నరేష్ రావణ్ మాట్లాడుతూ.. దళితులను ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ప్రవేశపెడుతున్న తెలంగాణ దళితబంధు పథకం ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని సంతోషం వ్యక్తంచేశారు. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటామని ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్నీరజాభూంరెడ్డి, 9వార్డు కౌన్సిలర్ కొత్తూరి మహేష్, 10వ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర భారతి నరేష్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.
- July 20, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- CM KCR
- చొప్పదండి
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం