సారథి, మానవపాడు: కలిసి పెరిగారు.. కలిసి చదువుకున్నారు. ఒకరికొకరు కలిసి స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూర్ గ్రామనికి చెందిన ఎండీ ఖాజాహుస్సేన్ నెలన్నర రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పదో తరగతి పూర్వవిద్యార్థులు (1998-99) రూ.63,500 ఆర్థికసాయం చేశారు. బొంకూర్ గ్రామానికి వెళ్లి మృతుడు ఎండీ ఖాజాహుస్సేన్ సతీమణి సైనాజ్ బేగం కుటుంబసభ్యులకు అందజేశారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. సాయం చేసిన స్నేహితులను పలువురు అభినందించారు.
- May 10, 2021
- Archive
- కరీంనగర్
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BONKUR
- MANAVAPADU
- old students
- పూర్వ విద్యార్థులు
- బొంకూర్
- మానవపాడు
- Comments Off on మేమున్నాం..