Breaking News

ఆ విషయంలో మీరు లౌక్యంగా మెలగండి

ఆ విషయంలో మీరు లౌక్యంగా మెలగండి

నేటి రాశిఫలాలు
7 మే 2021
శుక్రవారం

మేషం: చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వస్త్రవ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగంలో మీసేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పెద్దల సలహాలు పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఓ చిన్న విహారయాత్ర చేస్తారు. కుటుంబీకుల ధోరణి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

వృషభం: కుటుంబసభ్యుల నుంచి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి కృషిలో సత్ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మరింత నిరాశను కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి రుణఒత్తిడి పెరుగుతుంది. ఇంటాబయట వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్పమార్పులు ఉంటాయి. చేపట్టిన పనులను మందకొడిగా పూర్తిచేస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత చాలా అవసరం ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. నిరుద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

మిథునం: విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. మీ జీవిత భాగస్వామి వైఖరి మీక చికాకు కలిగిస్తుంది. చాలాకాలంగా పూర్తికాని పనులను పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు తోటివారి సహాయం లభించక ఆందోళన చెందుతారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియమైన రాక మీకు మరింత సంతోషం కలిగిస్తుంది. ఖర్చులు అధికంగానే ఉంటాయి.

కర్కాటకం: బంధువుల రాకతో కుటుంబంలో ఉల్లాసం, సంతోషం కనిపిస్తుంది. పనుల్లో వ్యయప్రయాసలు అధికం అవుతాయి. ఇంటిలో అనవసర వస్తువులపై ఎక్కువ ఖర్చుచేస్తారు. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం మంచిది కాదు. వారికి కాస్త దూరంగా ఉండండి. బ్యాంకు పనులు మందకొడిగా సాగుతాయి. ఆచితూచి మాట్లాడటం మంచిది.

సింహం: వ్యాపారాల్లో శ్రమ తప్పదు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులకు కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్యం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారంలో చికాకులు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.

కన్య: ఉద్యోగాల్లో ఒడిదుడుకులు పెరుగుతాయి. రాజకీయ నాయకులు విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. దూరపు బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మందగిస్తుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగస్తుల ప్రవర్తన కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి కలుగుతుంది. తరచూ బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. తలపెట్టిన పనులను అడ్డంకులు లేకుండా పూర్తిచేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి.

తుల: ఉద్యోగులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఉంటాయి. పత్రికారంగంలోని వారికి ఒత్తిడి అధికమవుతుంది. వాహనచోదకులకు జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. ఇంటిలో శుభకార్య వాతావరణం నెలకొంటుంది. చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. మీ కార్యక్రమాలు బంధువుల రాకతో మార్చుకోవలసి వస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.

వృశ్చికం: ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఆర్థికంగా అభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో అధికారులు ఆదరణ పెరుగుతుంది. పాత విషయాలను గుర్తుచేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. రుణ వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో ఒత్తిడి నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఉమ్మడి వెంచర్లు, భాగస్వామిక వ్యాపారాల ఆలోచన ప్రస్తుతానికి వాయిదా వేయండి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలను ఎదుర్కొంటారు.

ధనుస్సు: మహిళలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. కుటుంబసభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. పనులు సకాలంలో పూర్తికావు. రుణదాతల ఒత్తిడి అధికమవుతుంది. వృథాఖర్చులు మరింత పెరుగుతాయి. చేతివృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. సంతానయోగం కలుగుతుంది. మీరు చేసే పనికి ఫలితం మరోరకంగా ఉండే అవకాశం ఉంది. కార్యసాధనంలో ఆటంకాలను అధిగమిస్తారు. మీ కుటుంబానికి మీరు ఎంతో అవసరం ఉంటుంది. కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. నూతన దంపతులకు అగచాట్లు తప్పవు.

మకరం: ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. దాయాదులతో భూవివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని స్థానచలనాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. మనస్సులో ఉన్నవారి మధ్య కలహాలు తలెత్తుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.

కుంభం: ఉభయల మధ్య పట్టింపులు, కలహాలు చోటుచేసుకుంటాయి. బంధువుల రాకతో మీరు కొంత అసౌకర్యానికి గురవుతారు. దూరప్రాంత బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సోదరులతో విలువైన విషయాలు చర్చిస్తారు. ఇతరుల మాటలు లెక్కచేయక అడుగు ముందుకేసి శ్రమించండి. వ్యాపారంలో సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు పెరిగినా సంతృప్తికరంగా ఉంటాయి. మీ ప్రయత్నాలకు సన్నిహితులు అన్నివిధాలుగా సహకరిస్తారు.

మీనం: ఉత్తర, ప్రత్యుత్తరాలు మీకు ఎంతో సంతృప్తినిస్తాయి. మనసులో భయాందోళనలు అనుమానాలు ఉన్నప్పటికీ డాంభికం ప్రదర్శించి పనులను సాఫీగా పూర్తిచేస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఉద్యోగాల్లో వివాదాల పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో నూతనోత్సాహం. లాభాలు అందుకుంటారు. సోదరులు, సోదరీమణులతో ఏకీభవించలేకపోయారు. ప్రముఖులను కలుసుకుంటారు.
:: బ్రహ్మశ్రీ విప్పర్ల మహేశ్ విశ్వకర్మ గురూజీ,
ప్రముఖ జ్యోతిష్య పండితులు,
సెల్​నం.95020 59649