సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలను ఆదివారం ఆలయ ఏఈవో సంకేపల్లి హరికిషన్ సందర్శించారు. వర్షాకాలం వచ్చినందున గోశాలలోని కోడెలకు గిట్టల చీల్పు, నోటి బొబ్బలు, పొదుగు వాపు, పిడుదులు, గోమార్లు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రతి కోడెకు వర్షాకాలంలో విధిగా టెస్టులు చేయించాలని సూచించారు. డీ వార్మింగ్ చేయించాలని, ఇతర వ్యాధుల బారిన పడకుండా తప్పనిసరిగా టీకాలు వేయించాలని గోశాల ఇన్ చార్జ్ శంకర్ కు సూచించారు. వర్షాలకు కోడెలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
- June 13, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- goshala
- Rajanna
- VEMULAWADA
- వేములవాడ
- సిరిసిల్ల
- Comments Off on రాజన్నగోశాల సందర్శన