Breaking News

అందరి సహకారంతోనే గ్రామ అభివృద్ధి సాధ్యం.

గంగా రం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు హరీశ్వర్ రెడ్డి.

బిజినే పల్లి , సామాజిక సారథి : అందరి సహాయ సహకారాలతోని గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుండ్లపల్లి హరీశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం బిజినాపల్లి మండలం గంగారం గ్రామ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన తండ్రి కీర్తిశేషులు గుండ్లపల్లి వెంకటరెడ్డి స్మారకార్థం విద్యార్థులకు క్రీడ సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు శారీరక మానసిక ఎదుగుదలకు చదువులు ఎంత ముఖ్యమో క్రీడా కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యమని అన్నారు.విద్యార్థి దశ నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం బాగుంటుందని అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. ముఖ్యంగా ఏ గ్రామమైన అభివృద్ధి చెందాలంటే దాతలు సహకారం ఉన్నప్పుడే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలకు ఎన్ని సేవలు చేసిన తక్కువేనని ఆ అవకాశాన్ని పాఠశాల యాజమాన్యం తనకు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులకు క్రీడ సామాగ్రిని అందజేస్తున్న హరీష్ రెడ్డి

పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముందుగా పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన హరీశ్వర్ రెడ్డి కి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ అడగగానే పాఠశాల అభివృద్ధికి తరదైన శైలిలో స్కూల్ నేమ్ బోర్డ్ , విద్యార్థులకు స్పోర్ట్ యూనిఫామ్ లు ఇప్పియడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు . అదేవిధంగా పాఠశాలలో భారతదేశ చరిత్ర తెలిపి చిత్రపటాలకు తెలంగాణ ఖ్యాతిని చాటిచెప్పి చిత్రపటాలకు వేయించడం జరిగిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా గ్రామ నాయకులు పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సురేష్, ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్, రత్న శేఖర్, రాజప్ప, యాకూబ్ అలీ, కురుమయ్య, రమాదేవి, ఇందుమతి, రామస్వామి, పూర్వ విద్యార్థులు బి రాజ వర్ధన్ రెడ్డి, శాంతయ్య, విష్ణు, బురయ్య, రాములు, ఉప్నమోని శివ, శ్రీకాంత్ రెడ్డి, ఆటో పర్వతాలు, విద్యార్థిని విద్యార్థులు పార్టీలకతీతంగా గ్రామ నాయకులు పాల్గొన్నారు.