సామాజిక సారథి, మహబూబ్ నగర్: ప్రజలకు ప్రభుత్వాలకు వారథిగా ఉంటూ నిస్వార్థంగా వార్తలు రాస్తున్న విలేకర్లపై దాడులకు పాల్పడితే సహించబోమని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జర్నలిస్టు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గండీడ్ మండల వెలుగు రిపోర్టర్ రామకృష్ణారెడ్డి రైతుల కష్టాలపై వార్తలు రాయడంతో, గండీడ్ మండలం ఎంపీపీ మాధవి అసభ్యపదజాలంతో దుషించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని బాధిత రిపోర్టర్ పేపర్లో వార్తగా ప్రచురించారు. ఎంపీపీ బెదిరింపులకు పాల్పడ్డట్టు వారు ఆరోపించారు. అనంతరం స్థానిక ఎస్ఐకి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో గండీడ్ మండల జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు నవీన్. వెలుగు జిల్లా బ్యూరో ఇన్ చార్జి ధరణి, ఫొటోగ్రాఫర్ కిరణ్, రామకృష్ణారెడ్డి, వెంకటేష్, మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఓయు వెంకట్, బీజేపీ, సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- November 28, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- Compliant at Police Station
- JOURNALISTS
- MAHABUBABAD
- జర్నలిస్టుల
- పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్
- మహబుబాబాద్
- Comments Off on జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకోబోం