సారథి, వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడు కారం రవీందర్రెడ్డి, కరీంనగర్ టీఎన్జీవో ప్రెసిడెంట్ మారం జగదీశ్ దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో సాదరంగా ఆహ్వానం పలికి వేదోక్తంగా ఆశీర్వచనాలు అందించారు. పీఆర్వో ఉపాధ్యాయుల చంద్రశేఖర్ రావు శాలువాతో సత్కారించి సన్మానించారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా టీఎన్జీవో ప్రెసిడెంట్ తో పాటు ఏఈవో ప్రతిన నవీన్, పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.
- August 12, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- Rajeshwaraswamy
- TSPSC
- VEMULAWADA
- టీఎస్పీఎస్సీ
- రాజరాజేశ్వరస్వామి
- వేములవాడ
- Comments Off on రాజన్నకు టీఎస్పీఎస్సీ సభ్యుడి పూజలు