సారథి న్యూస్, పెద్దశంకరంపేట: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు పెద్దశంకరంపేట మండలంలో విశేష స్పందన లభిస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పుస్తకాలతో పాటు నగదును పార్టీ మండలాధ్యక్షుడు మురళి పంతులు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి అందజేశారు. మండలంలో దాదాపు ఐదువేలకు పైగా సభ్యత్వ నమోదు చేశామని, అందులో ఇప్పటివరకు 2500 సభ్యత్వాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే బలమని, మండలంలో ప్రతిఒక్కరికీ సభ్యత్వం అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు ఉన్నారు.
- March 6, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- MLA BHUPALREDDY
- NARAYAKHED
- TRS MEMBERSHIP
- ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
- టీఆర్ఎస్ సభ్వత్యం
- నారాయణఖేడ్
- Comments Off on అట్టహాసంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు