సారథి న్యూస్, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ద్వారక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మ్యాడం బాలకృష్ణ హాజరై పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీలో వరుసగా పద్మగల్ల లక్ష్మి, కుమ్మరి నవ్య, నిమ్మగల్ల సరిత, నిమ్మగల్ల విజయ మొదటి, రెండవ, మూడవ, నాలుగవ బహుమతులను గెలుచుకున్నారు. మహిళలను చైతన్యపరిచేందుకు పోటీలు నిర్వహించామని గ్రామ సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ లక్ష్మణ్, సహకార సంఘం చైర్మన్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ సిద్దిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సిద్ధిరాములు, నాయకులు శంభుని రామాగౌడ్, చాకలి స్వామి, శంభుని రాజ్ కుమార్, వెంకటేశం, మచ్చ విజయ్ రాజ్, ఎరుకల బాలయ్య పాల్గొన్నారు.
- January 16, 2021
- Archive
- CHINNASHANKARAMPET
- SURARAM
- TPCCC
- చిన్నశంకరంపేట
- టీపీసీసీ
- ముగ్గుల పోటీలు
- సూరారం
- Comments Off on సూరారంలో ముగ్గుల పోటీలు